యాక్సిడెంట్ కి గురైన వ్యక్తికి ఆర్ధిక సహాయం అందించిన కాట్నం విశాలి

ఇటీవల తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి యాక్సిడెంట్ కి గురి అయిన సందర్భంలో ఆ వ్యక్తి కాలు తిసేయాల్సి వచ్చింది.. ఈ విషయం జనసేన నాయకురాలు.. గోదావరి జిల్లాల రీజనల్ ఆర్డినేటర్ శ్రీమతి కాట్నం విశాలి దృష్టికి తీసుకెళ్లగా డైరెక్ట్ గా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి.. అక్కడ హాస్పిటల్ సూపర్నెంట్ తో మాట్లాడి.. వాళ్ళకి ఆర్ధిక సహాయం చేయడమే కాకుండా.. ఆయనకు సదరన్ సర్టిఫికెట్ చేయించి నెల నెలా పెన్షన్ వచ్చేలాగా చూస్తానని.. ఆమెకు ఫ్యూచర్లో వారి సొంత కాళ్ళ మీద నిలబడగలకే సహాయం చేస్తాను అని మాట ఇచ్చి రావడం జరిగింది. ఈ సందర్భంగా కాట్నం విశాలి గారికి సాయిరామ్ బడేటి హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది.