డాక్టర్ పిల్లా శ్రీధర్ విదేశీ పర్యటనలో ఉన్నా… ఆగని జనసేన కార్యక్రమాలు

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ విదేశీ పర్యటనలో ఉన్నా గాని నియోజకవర్గంలో జనసేన కార్యక్రమలు ఆగకూడదు అనే ఉద్దేశంతో డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆదేశానుసారం డాక్టర్ అన్నయ్య శివశంకర్ దుర్గాడ గ్రామం నందు సుబ్బారావు షష్టి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని అన్న సంతర్పణ కార్యక్రమం నిమిత్తం 1116/- స్వామివారికి విరాళంగా ఇవ్వడం జరిగింది. అనంతరం దుర్గాడ గ్రామంలోని జనసైనికులు కార్యకర్తలు నాయకులతో కలిసి పార్టీ బలోపేతానికి పార్టీలోకి జాయినింగ్ లు చాలా అవసరమని దాని మీద దృష్టి పెట్టాలని జనసైనికులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాటి మధు, ఇంటి వీరబాబు, కోలా నాని, బొమ్మిడి శివరాం, వెలుగుల దుర్గాప్రసాద్, బండి బాలు, కోలా గణపతి, గొన్నెపూడి స్వామి, కర్నీడి లక్ష్మణ్, శాఖ సురేష్, గొల్లపల్లి శివ, కొప్పల చక్రధర్, బండి అప్పారావు, కొండేకలపూడి గంగాధర్, ఇంటి గిరి, మొగిలి శ్రీను, ఇంటి ప్రసాద్, పి బాబ్జి, మరియు జనసైనికులు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.