జాతిపితకి నివాళులు అర్పించిన పొన్నలూరు జనసేన నాయకులు

కొండెపి: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కనపర్తి మనోజ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చిన సమరయోధుల్లో గాంధీ ముఖ్య పాత్ర పోషించారు. సత్యం అహింస ఆయన సిద్ధాంతాలు మరియు ఆయుధాలు, అహింస పద్ధతిలో సహాయనిరాకరణ సత్యగ్రహం ఉద్యమాలు చేసి విజయం సాధించారు. గాంధీ గారిని భారతదేశ ప్రజలందరూ జాతిపిత మరియు మహాత్ముడు అని పిలుచుకుంటారు అని మనోజ్ కుమార్ తెలియజేశారు. గాంధీ గారి సిద్ధాంతాలు పాటిస్తూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, 1932లో దేశంలో అంటరానితనం నిర్మూలనకు మరియు వారి జీవితాలను మెరుగుపరచుటకు ఆయన చేసిన ప్రచారం నన్ను ప్రభావితం చేసింది అని పొన్నలూరు మండలం ఐటి ఈభాగం అధ్యక్షులు పిల్లిపోగు పీటర్ బాబు తెలియజేశారు. గాంధీ గారి సిద్ధాంతాలు ఆలోచనలు మనం అందరం తెలుసుకుని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళాలి, గాంధీ గారు చెప్పినట్లు ఓటు మరియు సత్యగ్రహం అనేవి ప్రజల చేతుల్లో ఆయుధాలు, వాటిని సక్రమంగా వినియోగించేలా మనమందరం కృషి చేయాలి అని పొన్నలూరు మండల ఉపాధ్యక్షులు పెయ్యల రవికుమార్ యాదవ్ తెలియజేశారు.