నువ్వు నొక్కిన ప్రతి బటన్ నీకు రివర్స్ జగన్: యుగంధర్ పొన్న

  • సంప్రదాయంగా, సంస్కారవంతంగా మాట్లాడ్డం నేర్చుకో:
  • త్వరలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటన విజవంతం చేద్దాం
  • త్వరలో గంగాధర నెల్లూరులో పార్టీ కార్యాలయ ప్రారంభ మహోత్సవం
  • నియోజకవర్గ స్థాయి సమావేశంలో జనసేన ఇంచార్జ్ యుగంధర్

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, నియోజకవర్గ స్థాయి సమావేశం జనసేన ఇంచార్జ్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటన విజవంతం చేద్దామని, త్వరలో గంగాధర నెల్లూరులో పార్టీ కార్యాలయ ప్రారంభ మహోత్సవం చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, ఉపాధ్యక్షులు చార్లెస్, మండల యువజన అధ్యక్షులు బాలరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సురేష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, మండల యువజన అధ్యక్షులు నరసింహులు, మండల బూత్ కన్వీనర్ అన్నామలై, మండల ప్రధాన కార్యదర్శి నరేష్, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, ఉపాధ్యక్షులు రాఘవ, పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, గంగాధర్ నెల్లూరు మండల ఉపాధ్యక్షులు రషీద్, వెదురుకుప్పం మండల బూత్ కన్వీనర్ మునిరత్నం శెట్టి జనసైనికులు పాల్గొన్నారు.