టీడీపీ రిలే నిరాహార దీక్షకు పెండ్యాల శ్రీలత మద్దతు

  • జనసేన, టీడీపీలు అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని అంతమొందిస్తాయి
  • అక్రమ కేసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న వైకాపా
  • ఇంకొక ఆరు మాసాల తర్వాత జనసేన టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా రంజక పాలన మొదలవుతుంది
  • రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత

అనంతపురం: టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని రాంనగర్ సమీపంలోగల కమ్మభవన్ దగ్గర టీడీపీ అర్బన్ ఇంచార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ తరపున రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత సంఘీభావం తెలిపారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమ కేసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం వైకాపా ప్రభుత్వం చేస్తుందని దీనిని జనసేన టిడిపి పార్టీలు మూకుమ్మడిగా ఎదుర్కొని వైకాపాని రాష్ట్రంలో లేకుండా చేస్తామని ఎన్ని అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంల బయటకు వస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, వీరమహిళలు, జిల్లా, నగర కార్యవర్గ సభ్యులు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.