31న తలపెట్టిన 24గంటల మన్యం బంద్ కు అందరూ సహకరించాలి

మన్యం జిల్లా, 24న తేదీన శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బోయ వాల్మీకిలను, బెంతు ఒరియా లను ఎస్టి జాబితాలో కలుపు తీర్మానం చేసింది. ఆ తీర్మానం వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో మన్యం బంద్ కు జనసేన సిపిఎం జేఏసీ నాయకులు అందరు పిలుపునిచ్చారు. కావున ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డ పాల్గొని బందుని సంపూర్ణంగా విజయవంతం చేయాలని, ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఆదివాసి సంఘాలు, మహిళా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై చేస్తున్న బంద్ కు స్థానిక వ్యాపారస్తులు, దుకాణాలు, హోటల్స్, లాడ్జీలు, అన్ని రకాల వ్యాపార సంస్థలు బంద్ కు సహకరించవలసిందిగా కోరుతున్నాం. టూరిస్టులు ఇబ్బందులు పడకుండా ముందురోజు అనగా 30 తేదీన మన్యం విడిచిపెట్టి వెళ్లి పోవాలని, 31 నా ఎవరు రాకుండా రిసార్ట్స్, లాడ్జీల యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, శాంతి యుతంగా జరుగుతున్న బంద్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని, మన్యం బంద్ జరుగుతున్న ప్రాంతంలో ఆర్టీసీ బస్‌లు కూడా తిరగకుండా డిపో మేనేజర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా, ఆదివాసిగా పుట్టిన ఉద్యోగులు అందరూ తప్పకుండా సెలవు పెట్టుకుని ఆరోజు బంద్ కు రావాలని, రానివారు ఆదివాసి ద్రోహులుగా మిగిలి పోతారని తెలియజేస్తున్నాం. విధ్యార్ధులు, నాయకులు, మేధావులు, రైతులు, అందరు తప్పకుండా సహకరించాలని కోరుతున్నాముని జనసేన నాయకులు మురళి, నవీన్ కుమార్, ప్రవీణ్ కుమార్, మంగళ రమేష్, వీర మహిళ రత్నప్రియా ఈశ్వర్ తెలియజేసారు.