జనసేన జెండా దిమ్మెను ఆవిష్కరించిన తంబళ్ళపల్లి రమాదేవి

  • చందర్లపాడు మండలం, వెలదికొత్తపాలెం గ్రామంలో జనసేన పార్టీ జెండా దిమ్మెను ఆవిష్కరించిన జనసేన సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి

నందిగామ నియోజకవర్గం: యన్టీఆర్ జిల్లా, చందర్లపాడు మండలం, వెలదికొత్తపాలెం గ్రామంలో నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి భారీ ర్యాలీగా గ్రామంలో తిరిగి గ్రామంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా దిమ్మెను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ దొంగ ఓట్లను ఎలా గుర్తించాలో వివరించారు. వైసీపీ ప్రభుత్వాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. వారు పదవి కోసం ఎంతటి అరాచకానికైనా పాల్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వంలోని వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో ఉంచుకొని రాష్ట్రంలోని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఓట్ల జాబితాను ముసాయిదా విడుదల చేసినప్పటికీ అందులోని అవకతవకలను పూర్తిగా సరి చేయలేదు. ఈ విషయాన్ని మనమందరం గుర్తుంచుకొని గ్రామంలో ఉన్న ప్రతి జనసైనికులు టిడిపి నేతలు కలిసి సమన్వయం పాటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు ఉన్నాయా తొలగించబడ్డాయా తెలుసుకొని వాటిని ఎలా సరి చేసుకోవాలో ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమంలో పాల్గొని రాబోవు 2024 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి ఈ వైసిపి విముక్త ఆంధ్ర ప్రదేశ్ సాధిద్దాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జనసైనికులు వీరమహిళలు, ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, వెలదికొత్తపాలెం గ్రామ జనసేన పార్టీ నాయకులు తాళ్ళ నాగరాజు, జిల్లేపల్లి గోపి, చందర్లపాడు మండలం అధ్యక్షులు సుదాకర్, రంగ మాధవి, సూర సత్యన్నారాయణ,వెంకట్, నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.