జనసేన పార్టీ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి: బొర్రా వెంకట అప్పారావు

  • మొక్కపాడు గ్రామంలో పర్యటించిన బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, రాజుపాలెం మండల జనసేన అధ్యక్షులు తోట నరసయ్య, రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో, గ్రామ పెద్దలను కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలను, ఆశయాలను చర్చించడం జరిగినది. పార్టీ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కృషిచేసి, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి చేరవేయాలని, అదే విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఫిబ్రవరి 28 వరకూ జరుగుతుందని, అధిక సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం గురించి అవగాహన కల్పించి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలని కోరటం జరిగినది. అదే గ్రామానికి చెందిన శివాలయం అర్చకులు బెల్లంకొండ కోటేశ్వరరావు, గుండెపోటుతో, మరణించాడు, ఆ కుటుంబానికి, సానుభూతితో బొర్రా అప్పారావు తన వంతు 5000 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు, ఈ కార్యక్రమంలో మొక్కపాడు గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు, పోకల శ్రీనివాసరావు, రాజుపాలెం మండలం జనసేన ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు, రాజుపాలెం మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కేదారి రమేష్, జనసేన నాయకులు గాంధీ సదాశివరావు, అనుపాలెం జనసేన గ్రామ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మొక్కపాడు గ్రామ పెద్దలు, పోశం శ్రీనివాసరావు, పులిబండ్ల ముక్కంటి గోపి, పశ్చావుల సీతయ్య, కనడం కోటేశ్వరరావు, పోలేపల్లి నరసింహారావు, నాన బాల రమణయ్య, బిట్రగుట్ట సుబ్బారావుపాల్గొన్నారు.