ఆదర్శప్రాయుడు చిరంజీవి: వబ్బిన సత్యనారాయణ

ఎస్ కోట నియోజకవర్గం: సామాజిక సేవతో చిరంజీవి ఆదర్శప్రాయుడిగా నిలిచారని ఎస్ కోట నియోజకవర్గం జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ పేర్కొన్నారు. కొత్తవలస మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు స్థానిక చైతన్య మానసిక బధిరుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వబ్బిన సత్యనారాయణ మాట్లాడుతూ రక్తదానం, నేత్రదానంపై ప్రజల్లో ఈ స్థాయిలో అవగాహన రావడానికి చిరంజీవే కారణమన్నారు. సాధారణ కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగి ఈ తరం యువతకు ఆదర్శంగా నిలిచారని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు గొరపల్లి రవికుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాలు చిరంజీవిని అభిమానిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నక్కరాజు సతీష్, పిల్ల రాందుర్గ, మల్లువలస శ్రీను, తూరిబిల్లి విజయ్ కుమార్, అలమండ సురేష్, వార్డు మెంబర్ గాలి అప్పారావు, బోని రాంగణేష్, కోట్యాడ అయ్యప్ప, గోకాడ సూర్య మనోజ్, గురజాడ వెంకటేష్, బోర శ్రీను, ముచ్చకర్ల శ్రీను, పెంటకోట శ్రీను, బోగాది దేవా, రుద్ర నాయుడు, జనసైనికులు, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.