పాడేరు జనసేన కార్యాలయంలో ఘనంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలు

పాడేరు నియోజవర్గం: పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా అభిమానులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఒక సామాన్య నటుడు నుంచి అంచెలంచెలుగా క్రమశిక్షణతో కూడిన ప్రతిభతో యావత్ భారత దేశం గర్వించదగ్గ నటుడయ్యారు. నటనలో ఎన్నోశిఖరాలు అధిరోహించిన చిరంజీవికి అశేషాభిమానులున్నారు. సినిమా రంగంలో ఒక కొత్త ఒరవడి సృష్టి మెగాస్టార్ తో మాత్రమే మొదలయ్యింది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగివుండే లక్షణం ఆయన క్రమశిక్షణకు ఉదాహరణ. తెలుగు సినిమా రంగంలో మకుటంలేని మహారాజు మెగాస్టార్ చిరంజీవి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతున్నామని ఈ సందర్బంగా జనసేన నాయకులు, అభిమానులు అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య, జనసైనికులు, వీరమహిళలు పాల్గొని మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వహించారు.