వారపు సంతలో సదుపాయాలు శూన్యం: రామశ్రీనివాసులు

అన్నమయ్య జిల్లా, సుండుపల్లి మండలంలో.. వారపు సంతలో సదుపాయాలు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై.. లక్షలకు లక్షల ఆదాయం గడిస్తున్నా పంచాయతీ కి ఆదాయం వస్తుంది తప్ప.. కనీసం మరుగుదొడ్లులో సదుపాయాలు లేకపోవడం దారుణం. పంచాయతీ కి వారపు సంత, పశువుల సంతకి లక్షలు వస్తున్నా.. సదుపాయాలు చేయకపోవడం దారుణం అని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిదర్శనం ఆదివారం చోటుచేసుకుంది. సుండుపల్లి వారపు సంత మరుగుదొడ్లు కొరకు నలుగురు మహిళలు రావటం జరిగింది. అయితే అక్కడ మరుగుదొడ్లకు తాళాలు వెయ్యడంతో తమకు సహాయం చేసే వాళ్ళు లేకపోవడంతో వారు వెను తిరిగారు దీనిపై జనసేన పార్టీ తీవ్రంగా కండిస్తుంది. మరుగుదొడ్లు కొరకు ఖర్చులు వెచ్చించి నిర్మాణాలు చేపట్టారే తప్ప.. అక్కడ మహిళలు కొరకు ఓ మహిళను ఏర్పాటు చేయకపోవడం దారుణమని రామశ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పంచాయతీ నిధులు బొంచెయ్యకుండా ప్రజా సమస్యలు తీర్చేవిదంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేని యెడల జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఎంతటి పొరటలకైనా సిద్ధంగా ఉన్నామని జనసేన పార్టీ తరపున రామశ్రీనివాసులు డిమాండ్ చేశారు.