రైతు కూలీలకు తక్షణమే మేలు చెయ్యాలి: చిట్టి ఉదయ్

హుస్నాబాద్, పనికి ఆహార పథకం దేశంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఆహారం ఉండాలని తలంపుతో ఈ పథకం తీసుకువచ్చారు. ముందు 100 రోజుల పని దినాలుగా ఉండే ఈ పథకం 150 రోజులుగా ఉంది. ఇది ప్రతి రాష్ట్రంలో అమలులో ఉంది. అసలు ఒక రోజుకు 170 రూపాయలు, ఎండాకాలంలో 200 రూపాయలు వస్తున్నాయా ఇప్పుడు. నాకు తెలిసి నా ఊరిలోనే 1 వారం నుండి 12వారాల డబ్బులు రావలసి ఉంది. ఈ వ్యవస్థ వలన అందరికీ అందుబాటులో ఆహారం ఉంటుందని అనుకున్నాను, కానీ ఈ పథకం వలన రైతుకు కూలీలు దొరకడం కష్టం అయ్యింది. ఈ పథకంలో చాలా లోపాలు ఉన్నాయి. చేసే పని సమయం తక్కువ ఉండటం వలన రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఈ పథకం ఉన్నప్పుడు 1 గంట పనికి 100 రూపాయల నుండి 200 రూపాయల వరకు వచ్చేవి. కానీ ఇందులో ఉన్న లొసుగులు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫోటో విధానం తీసుకువచ్చింది. కనీసం నాలుగు గంటలు పనిలో వుండాలన్న షరతు తీసుకువచ్చింది. పని చేసేవారిని నువ్వు 1 గంట పని చేయించి 100 నుండి 200 ఇచ్చి ఇప్పుడు 4 గంటలు పని చెయ్యమంటే ఎవరు వెళ్తారు. అందుకే ఈ పథకానికి ప్రాముఖ్యత తగ్గింది. ఇందులో కూడా దళారీ వ్యవస్థ పని చేసేవారు తన వారు అయితే పనికి రాకుండా కూడా డబ్బు దొంగిలించారు. ఇప్పుడు నాలుగు గంటలు పని చెయ్యమంటే వారికి ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ రైతుకు 150 ఆడ వారి కూలీ, 250 మగ వారి కూలీ ఉన్నది ఇప్పుడు ఆడవారికి 350, మగ వారికి 500 భారం రైతుకు పడింది. రైతు కూలీలను సోమరులను చేసిన ఘనత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చలవే. రైతును ఇంకా ఇబ్బందుల్లో నెట్టింది కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చలవే. నాకు తోచింది రాయడం లేదు నిజం మాత్రమే రాస్తున్న. నా సలహా ఉపాధి హామీ పథకాన్ని రైతులకు కూడా అనుసందానం చేస్తే అటు రైతుకు, ఇటు రైతు కూలీలకు మంచి జరుగుతుంది. రైతుకు కూడా భారం తగ్గుతుంది. అతను చేసే కూలీ ఖర్చు కూడా ఈ పథకంలో చేర్చితే ప్రభుత్వానికి కూడా కొంత భారం తగ్గుతుంది. పూర్వం 15 సంవత్సరాల క్రితం రైతుతో పాటు 9 గంటలకు వెళ్లి 5 గంటలకు తిరిగి వచ్చేవారు రైతు కూలీలు. ఈ పథకం వలన రైతు పొలంలోకి ఉదయం 10 అయినా చేరడం లేదు, సాయంత్రం 4 అవగానే బయటకు వచ్చేస్తున్నారు రైతు కూలీలు. ఇందులో గంట భోజనంకు తీసేస్తే 5 గంటల పనికి 350 రూపాయలు, 500 ఒక మనిషికి. అదే అప్పుడు 8 గంటల పనికి ఇంత ఖర్చు అయ్యేది కాదు రైతుకు. ఇది గమనించి మార్పులు చేసి ఈ పథకానికి పూర్వ వైభవం తీసుకురావచ్చునని హుస్నాబాద్ జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.