కోరలు చాస్తున్న కరువు ఛాయలు – కష్టాల కడలిలో రైతాంగం

  • ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీ కో-ఆర్డినేటర్ శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో రైతు గర్జన

ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన-తెలుగుదేశం కో-ఆర్డినేటర్ శ్రీమతి లోకం మాధవి పిలుపు మేరకు ఆదివారం విజయనగరంలోని 9 నియోజకవర్గాలలో రైతు గర్జన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో వర్షా భావం వలన కరువు ఛాయలు అలుముకున్న వేళ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం చాలా బాధాకరం తన రక్తాన్ని శ్రమగా మలిచి సేధ్యం చేసే రైతన్నకు అడుగడుగునా అవరోధాలే. నెల్లిమర్ల నియోజకవర్గంలోని తోటపల్లి కాలువ వదలక పోవడం వలన సుమారు 42,000 ఎకరాల సాగునీరు అందించలేకపోయారు. ఆ కాలువకి పూర్తిస్థాయిలో మరమ్మత్తులతో కూడుకొని ఉంది, రామతీర్థ సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు ఆనాడు సుమారు 24 వేల ఎకరాలకి త్రాగునీరు అందిస్తామని ప్రారంభించిన ప్రాజెక్టు అడ్డదారులు తొక్కుతూ ఈనాడు ఎయిర్పోర్టుకి మరియు విజయనగరానికి నీరు అందించేలా ఆ ప్రాజెక్టుని పూర్తిస్థాయిలో మార్చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం, ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి కార్యరూపం దాల్చలేదు, ఇది పూర్తిస్థాయి వైసిపి వైఫల్యమే అని మాధవి ఎండగట్టారు. రైతుల పక్షపాతి అని డప్పేసుకుని వైసీపీ ప్రభుత్వం రైతుల సుభిక్షం కోసమే అంటూ ఏర్పాటు చేసిన ఆర్బికె కేంద్రాలు ప్రతి ఏడాది నాణ్యతలేని విత్తనాలు ఇవ్వటమే కాకుండా సేద్యానికి అవసరమయ్యే యూరియా, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఫెర్టిలైజర్స్ ను అవసరానికి తగ్గట్టుగా వాడే రైతుకు ఇవి ఒక క్రమ పద్ధతిలో కొనాలని మాండేట్ పెట్టడం దగ్గర నుంచి, పెట్టుబడి రాయితీలు రాకపోవడం, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వకపోవడం, అలాగే కార్పొరేట్ భీమా కంపెనీలకు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా ఈ-క్రాప్ వంటివాటిలో సాంకేతిక అవరోధాలతో రైతుకు పరిహారం ఎగవేస్తున్నారు. ఈ అవరోధాలు అన్నీ దాటుకొని మనకు ఆహారం అందించేందుకు రైతు వ్యవసాయం చేస్తున్న వైనం. అరకొర అదునులో ఉన్నదంతా ఊడ్చి దుక్కిపాల్జేసిన రైతన్న ఇప్పుడు వర్షాభావం వలన తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. ధరాఘాతంతో సాగుపెట్టుబడులు పెరిగిపోయి ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని వర్షా భావ పరిస్థితులు మరింత గడ్డుస్థితిలోకి నెట్టేస్తున్నాయి. పంట పోతే చేసిన అప్పులు తీర్చలేక రైతు కుటుంబాలు కృంగిపోతూ ఆత్మహత్యలు చేసుకునే విచారకర పరిస్థితిలో రైతాంగం ఉంటే పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం. విశాఖపట్నంలో జరుగుతున్న ఐసీఇడి సదస్సును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు హుటాహుటిన 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకొంది. వాస్తవానికి 400లకు పైగా మండలాలలో కరువు పరిస్థితులు ఉన్నాయి కాని ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి ఈ దుందుడుకు చర్యలు.

ఇప్పటికే రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్ లో 24 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గి ప్రమాద ఘంటలు మోగుతున్న వేళ ఇప్పుడు వచ్చిన ఈ కరువు పరిస్థితులు ఆహార ఉత్పత్తుల పైన తీవ్ర ప్రభావం ఉంటుంది. నిత్యావసర కొరతలు ఏర్పడే ప్రమాదం ఉంది. మనకు ఇంతకుమునుపు వచ్చిన కరువు పరిస్థుతుల నుండి పాఠాలు నేర్చుకుని ఉండి ఉంటే పోలవరం లాంటి ప్రాజెక్టుల పూర్తిచేయడం మీద అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ మీద చెరువుల, కాలువలు మరమ్మతుల మీద ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో ఉన్న తోటపల్లి కాలువ నుంచి నీరు వదలడం మీద దృష్టి పెట్టి ఉంటే కొద్ది పాటి వర్షాలు పడినప్పటికీ ఆ నీరును వృధాపోకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధమయ్యేవి కాని ఈ ప్రభుత్వానికి బటన్లు నొక్కడం మీద ఉన్న శ్రద్ధ రైతు సమస్యల మీద లేదు.

గంపెడు ఆశలతో విత్తులు, పైర్లు వేసి నాష్టాలపాలై ఇన్ని కష్టాల కడలిలో ఉన్న రైతాంగానికి అండగా నిలబడి కరువు వల్ల నష్టపోయిన ప్రతీ ఎకరాకు రూపాయలు 25,000/- ఆర్థిక చేయూతను అందించి ప్రభుత్వం అండగా నిలవాలి అలాగే ప్రత్యామ్నాయ పంటల సాగుకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలి. ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు ప్రత్యేక భత్యం చెల్లించాలి. అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న 34 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి అండగా నిలబడాలి అనే నినాదంతో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ నియోజకవర్గం లోను రైతులతో పెద్ద ఎత్తున ప్రభుత్వంలో చలనం వచ్చే లాగా నిరసనలు తెలియచేయడం జరిగింది.

అందులో భాగంగా ఆదివారం నెల్లిమర్ల నియోజకవర్గంలో శ్రీమతి లోకం మాధవి నేతృత్వంలో నెల్లిమర్ల మండలంలోని మల్యాడ గ్రామం నుంచి మొదలుపెట్టి రైతులతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఓమ్మి గ్రామం మీదుగా 1500 మంది రైతులతో పాదయాత్ర చేస్తూ రైతుల తరపున వారి సమస్యల కోసం గర్జిస్తూ బారీ జనసందోహం మధ్య సతివాడ గ్రామం చేరుకుని రైతులను ఉద్దేశిస్తూ ప్రసంగించి రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు రైతన్నను ఆదుకోవాలని తన ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ముందుకు సాగుతూ రామతీర్థం గ్రామంలో బీడు భూములను రైతుల తో కలిసి పర్యవేక్షించి కరువు పరిస్థితులను తన గళం ద్వారా వినిపించారు అనంతరం పాత్రికేయ మిత్రుల తోను, డిజిటల్ మీడియా వారి తోను ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

  • బొబ్బిలిలో జనసేన-టిడిపి రైతు గర్జన

బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండలం, సోమదివలస గ్రామంలో ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన-తెలుగుదేశం కో-ఆర్డినేటర్ శ్రీమతి లోకం మాధవి పిలుపు మేరకు ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో కలిసి “రైతు గర్జన” కార్యక్రమాన్ని నిర్వహించారు. వరి పంటకు సకాలంలో సాగునీరు అందకపోవడంతో ఒకే గ్రామంలో దాదాపు 100 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 2500 ఎకరాలు పైచిలుకు పంట నష్టం జరిగుంటుందని బొబ్బిలి జనసేన నియోజకవర్గం ఇంచార్జి గిరడ అప్పలస్వామి మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ తెర్లాం మండల అధ్యక్షలు వెంకటనాయుడు, మాజీ ఎంపీపీ నర్సుపల్లి వెంకటేష్ మరియు నియోజకవర్గ నాయకులు పాల్గొని వరి పంట పొలాలను పరిశీలించారు. బాబు పాలూరు మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలో నాలుగు మండలాలలో పంట నష్టాన్ని ఆర్బికె సిబ్బంది ద్వారా గుర్తించి, కరువు మండలాలుగా ప్రకటించి తక్షణమే రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. గిరడ అప్పలస్వామి మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ ఒక రాక్షసుడిగా నియంతలా పాలిస్తున్నాడని ఎద్దేవా వేశారు. తెర్లాం జనసేన పార్టీ మండల అధ్యక్షులు మరడాన రవి, చందక ఉమా మహేష్ మరియు వీరమహిళ యామిని మరియు తెర్లాం మండలం తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ నష్టపోయిన వరి పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, రైతు పక్షపాతి అని చెప్పుకొనే వైసీపీ ఎమ్మెల్యే, ఈ వైసీపీ ప్రభుత్వం రైతులపై శ్రద్ద చూపకపోవడం దారుణమన్నారు, వెంటనే సంబంధిత అధికారులతో దర్యాప్తు చేసి నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందజేయాలన్నారు, లేని పక్ష్యం లో జనసేన టీడీపీ సమస్వయం తో భారీ ఎత్తున నిరసనలు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, రామభద్రపురం మండల అధ్యక్షులు భవిరెడ్డి మహేష్, జిల్లా కార్యనిర్వాహణ కార్యదర్శి మహంతి ధనుంజయ, జనసేన సీనియర్ నాయకులు లెంక రమేష్, కనకాల శ్యాం, అడబాలు నాగు, పళ్లెం రాజా, చీమల సతీష్, రాజా జగన్, తెర్లం మండల నాయకులు బూరి రామకృష్ణ, ఆర్పి రాజు, అబోతుల రాజు, పాండ్రంగి అప్పారావు, ఎందువ సత్యన్నారాయణ, వీరమహిళలు రమ్య, వరలక్ష్మి, గోపి, సాయి, నవీన్, శ్రీను, సింబు, శివ, మండల శ్రీకాంత్, జన్నివలస నవీన్, రామ్ లక్ష్మణ్, రఘు, రమేష్, పెరుమాలి శ్రీను, తదితర జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • గజపతినగరంలో జనసేన-టిడిపి రైతు గర్జన

ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన-తెలుగుదేశం కో-ఆర్డినేటర్ శ్రీమతి లోకం మాధవి పిలుపు మేరకు ఆదివారం జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో రైతు గర్జన కార్యక్రమాన్ని గంట్యాడ మండలం బుడతనాపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. వరి వ్యవసాయ పొలాలను నీటి సదుపాయం లేక, ప్రభుత్వం రైతులకు కరువు నష్టపరిహారం ప్రకటించక పోవడానికి నిరసనగా కరువుతో బీటా భూములుగా మారిన వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి, రైతులను పరామర్శించిన జనసేన నాయకులు మర్రాపు సురేష్ గారు మరియు తెలుగుదేశం పార్టీ గజపతినగరం ఇంచార్జ్ కే.ఎ నాయుడు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు కలిసి వెళ్లి రైతు గర్జన కార్యక్రమంను నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సాగునీరు అందక వ్యవసాయ పంటలు పూర్తిగా ఎండిపోయి, రైతులు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యేకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకి ఎండిన వరి పొలాలను కనీసం పరిశీలించే తీరికలేకుండా పోయిందా? అని అన్నారు. ఎమ్మెల్యే సామాజిక బస్సు యాత్రపై ఉన్న శ్రద్ద, నియోజకవర్గంలోని సామాన్యులపైనా, రైతుల ఇబ్బందులను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళుంటే కొంచమైనా మేలు జరుగుతుందేమో అని అన్నారు. రైతులకు సాగు నీరును అందించి, కరువు ప్రకటించి, ప్రతీ ఎకరానికి రూ.50 వేలు నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించి, నియోజకవర్గంలోని ఐదు మండలాలను కరువు ప్రకటించించి, రైతులని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్ మెంబర్ పడాల అరుణ,జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన, అడ్డడ మోహన్, టీడీపీ మండల నాయకులు భాస్కర్ నాయుడు, బాలాజీ, చాణక్య, చైత్యన, జనసేన మండల నాయకులు అప్పలరాజు, ఏర్ని నాయడు, వీరమహిళలు, రైతులు, కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

విజయనగరంలో జనసేన-టిడిపి రైతు గర్జన

ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన-తెలుగుదేశం కో-ఆర్డినేటర్ శ్రీమతి లోకం మాధవి పిలుపు మేరకు ఆదివారం వర్షాభావం వల్ల ఈ ఏడాది రైతులు ఆర్థికంగా నష్టపోయారని, తక్షణమే వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజయనగరం నియోజకవర్గ టీడీపీ-జనసేన నేతలు డిమాండ్‌ చేశారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయనగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామంలో రైతు గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ రైతులు తమ బాధను తెలియజేశారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టతున్నాయని వాపోయారు. ఈ సందర్భంగా జనసేన నేత గురాన అయ్యలు మాట్లాడుతూ తీవ్ర కరువు పరిస్థితుల్లో రైతాంగం ఉంటే వారి సమస్యలపై క్యాబినెట్ సమావేశంలో కనీసం చర్చించకపోవడం జగన్ ప్రభుత్వానికి అన్నదాతల సమస్యల పట్ల ఉన్న చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌నమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించడంపై ఉన్న శ్రద్ధ కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంపై లేదన్నారు. కరువు మండలాలకు సం బంధించి కలెక్టర్లు రాష్ట్రంలో 470మండలాల్లో వర్షా భావ పరిస్థితులు ఉన్నాయని నివేదిక ఇస్తే ప్రభుత్వం కేవలం 103 మండలాలు మొక్కుబడిగా ప్రకటించడం రైతుల్ని వంచించడం కాదా అని ప్రశ్నించారు. కరువు పరిస్థితుల నివారణ కోసం ప్రభుత్వం పైసా కూడా నిధులు ఇవ్వలేదన్నారు. జీవో-4 నాలుక గీసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా లోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఐవిపిరాజు, బొద్దల నర్సింగరావు, గంట పోలినాయుడు వేచలపు శ్రీను, రాజేష్ బాబులు మాట్లాడుతూ ఒక్కో ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశారని, వర్షభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మొక్కుబడిగా 103 కరువు మండలాలు ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా పడాల్సిన వర్షం, పడిన వర్షాన్ని లెక్కలోకి తీసుకోకుండా ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించడం బాధాకరమన్నారు. జీవో నెం- 4ద్వారా కరువు మండలాలు ప్రకటించడం తప్ప రైతుల కోసం రూపాయి సాయం చేసింది లేదని విమర్శించారు. రైతులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ టిడిపి నేతలు సిరిపురపు బంగారు నాయుడు, రొంగలి కృష్ణ, గొర్లె అప్పల కృష్ణ, పప్పలనాయుడు కోరుకొండ జనసేన నేతలు సిరిపురపు దేముడు, సిరిపురపు శ్రీనివాసరావు, గాలి నాగరాజు, గంట్లాన సింహద్రి, సిరా అప్పన్న నియోజకవర్గ జనసేన నేతలు కాటం అశ్విని, మాతా గాయిత్రి, పితాల లక్ష్మీ, రవితేజ, చక్రవర్తి, ఎమ్.పవన్ కుమార్, నవీన్ కుమార్, పృథ్వీ భార్గవ్, కె.సాయి, కంది సురేష్ కుమార్, వెంకట రమణ, మధు తదితరులు పాల్గొన్నారు.

పార్వతీపురంలో జనసేన-టిడిపి రైతు గర్జన

జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన-తెలుగుదేశం కో-ఆర్డినేటర్ శ్రీమతి లోకం మాధవి పిలుపు మేరకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు గర్జన అనే కార్యక్రమం, పార్వతీపురం నియోజకవర్గం, బలిజీపేట మండలంలో భారీ ర్యాలీతో రైతు గర్జన కార్యక్రమం బలిజిపేట మండలలో గలా గ్రామంలో ఉన్నటువంటి పొలాలలో వరిచేనుకి నీరు లేక తోటపల్లి కాలువలు లేక, విద్యుత్ సరఫరా లేక చేతుకొచ్చిన పంట నాశనం అయిపోయింది. దీనివల్ల రైతులకి చాలా నష్టం వాటిల్లింది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్దాం, రైతుకి తోడుగా ఉందాం, జనసేన పార్టీ నాయకులు పాలూరు వెంకటేశు, ప్రగాఢ కళ్యాణ్, పరుచూరి రమణ, రఘు మండల అప్పలనాయుడు, బేజ్పౌరుపు శ్రీను, బోనుల గోవిందమ్మ, గుంట్రెడ్డి గౌరీ శంకర్, చిట్ల గణేష్, ఖాతా విశ్వేశ్వరరావు, కర్రీ మణికంఠ, అంబటి బలరాం, అక్కన భాస్కర్, ఆగూరు శ్రీను, కిర్లంపూడి ధనుంజయ్ రావు జనసేన కార్యకర్తలు. టిడిపి నాయకులు నియోజకవర్గ నాయకులు, రైతులు మరియు మహిళాలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

  • కురుపాంలో జనసేన-టిడిపి రైతు గర్జన

కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి లోకం మాధవి సూచనల మేరకు కురుపాం నియోజకవర్గం, కొమరాడ మండలం, రాజ్యలక్ష్మిపురం గ్రామ పరిధిలో గల వాసిరెడ్డి కృష్ణమూర్తి రిజర్వాయర్ ఎడమ కాలువ ఎత్తిపోతల పథకం కింద నీటిని వదలవలసిన పరిస్థితిలో కరెంట్ బిల్లు కట్టలేదని ట్రాన్స్ఫార్మర్ ఖాళీ కొత్తది వేయాలి ఐదు లక్షల రూపాయల వ్యయమవుతుందని సాకులు చెప్పి సుమారు 3000 ఎకరాలు కాలువ ఆధారంగా పండే రైతులకు నష్టం వారించిన ఈ ప్రభుత్వాన్ని రైతాంగానికి అండగా నిలబడటం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం రైతు గర్జన కార్యక్రమాన్ని జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని రైతుల పక్షాన నిలబడటం జరిగింది. రైతులు గత రెండు నెలలుగా వర్షాలు లేకపోవడం చెరువులన్నీ ఎండిపోవడం పక్కనే రిజర్వాయర్ ఉంది,ఎడమ కాల్వ ఉందని నమ్మకంతో పంటలు వేసుకోవటం వలన నష్టపోయామని వారి గోడును వినిపించారు. ఈ కార్యక్రమంలో రైతులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

  • చీపురుపల్లిలో రైతు గర్జన

చీపురుపల్లి నియోజకవర్గం, గుర్ల మండలం, పున్నపురెడ్దిపేట గ్రామంలో వరి పొలాలను సందర్శించడం జరిగింది. రైతు గర్జన కార్యక్రమం పున్నపురెడ్డి పేట గ్రామంలో ఉన్నటువంటి పొలాలలో వరిచేనుకి నీరు లేక తోటపల్లి కాలువలు లేక, విద్యుత్ సరఫరా లేక చేతుకొచ్చిన పంట నాశనం అయిపోయింది. దీనివల్ల రైతులకి చాలా నష్టం వాటిల్లింది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్దాం, రైతుకి తోడుగా ఉందాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు విజయనగరం జిల్లా టీడీపీ ఇంచార్జి మరియు చీపురుపల్లి నియోజకవర్గం ఇంచార్జి కిమిడి నాగార్జున మరియు తదితరులు పాల్గొన్నారు.