కోన తాతరావుకు అభినందన సభ

గాజువాక, జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గ జనసేన పాఋతీ ఇంచార్జ్ కోన తాతరావుని విశాఖ అర్బన్ జిల్లా సమన్వయకర్తగా నియమించిన సందర్భంగా ఆదివారం అభినందన సభ నిర్వహించడం జరిగింది. ఈ అభినందన సభలో జనసేన పార్టీ విశాఖపట్నం రూరల్ కో-ఆర్డినేటర్ పంచకర్ల రమేష్ బాబు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివ శంకర్, జనసేన పార్టీ డాక్టర్ సెల్శ్రీ చైర్మన్ బోడేపల్లి రఘు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జిలు పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గాజువాక నియోజకవర్గ జనసేన పార్టీ యాక్టివ్ సభ్యులు మరియు పైల సాయి ధనుష్, అర్జున్ నామాల కార్యక్రమం నిర్వహణలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు మరియు పార్టీ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.