ఐరాలలో పవన్, వారాహి పేరిట ప్రత్యేక పూజలు

పూతలపట్టు:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకోసం ప్రజల కష్టాలను తెలుసుకొని, రాక్షస పాలన నుండి రక్షించడానికి తలపెట్టిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా జరగాలని ఐరాల మండల కేంద్రంలోని పాలేటి అమ్మవారి గుడి నందు జిల్లా మరియు మండల జనసేన నాయకులు పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ కి అందేలాగా అభిషేకాలు, ప్రార్థనలు చేశారు. ఆయన యాత్ర జరుగుతున్న సందర్భంలో అక్కడ జరిగే విశేషాలను, పార్టీ యొక్క సిద్ధాంతాలను పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజలకు చేరవేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పూతలపట్టు నియోజకవర్గం జనసైనికులు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరిగన్న తులసి ప్రసాద్, వీర మహిళ మైలారి దేవి, మండల నాయకులు సానే నవీన్, పసుపులేటి తులసి, తిరుమల వాసు, మైలారి వినయ్ కుమార్, రెడ్డప్ప, రోహిత్, చందు, సుబ్బు, ప్రవీణ్, భాను, విజయ్, భార్గవ్, గిరి, భరత్, వినుత్, ప్రకాష్ యమేష్, ప్రేమ్, నాగేంద్ర, కిరణ్, జయంత్, లచ్చి మరియు మండల సీనియర్ నాయకులు విద్యావంతులు తమ్మిశెట్టి మోహన్, సాన్ రమేష్, పురుషోత్తం, అక్కిపల్లి సభాపతి మరియు జనశైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.