ములుగు జిల్లాలో రైతు ఆత్మహత్య నన్ను కలిచివేసింది: ఆకుల సుమన్

ములుగు, ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామానికి చెందిన కుమార్ అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి ఆకుల సుమన్ అన్నారు, కుమార్ చాలా కష్టపడి రాత్రనక పగలనక ఏడు ఎకరాలు వరి సాగుచేసాడు రెండు ఎకరాలో పంటకోసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు మరో ఐదు ఎకరాలలో వారికోతకు సిద్ధంగా ఉంది వడ్లు అమ్ముడుపోక చేతిలో డబ్బులులేక అనేక ఇబ్బందులు ఎదురుకొని వడ్లు కొనే పరిస్థితి కనిపించకపోవడంతో తీవ్ర మనస్తపనికి గురై కొనుగోలు కేంద్ర వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి ఉమ్మడి రాష్టంలోని పాలకులు తెలంగాణా రైతంగాన్ని తీవ్ర నిర్లక్ష్యనికి గురిచేస్తే ఇప్పటి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ధోరణిలో పోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాది రైతుల ప్రభుత్వం అని పదే పదే చెప్పే మాట ఉత్త మాటలకే పరిమితం అని ఇప్పుడు మళ్ళీ రుజువైయింది తెలంగాణా రాష్ట్రంలో ఇంకెన్ని రైతు ఆత్మహత్యలు జరగాలి..? హుజురాబాద్ ఎన్నికల మీద పెట్టిన శ్రద్ధ మన రాష్ట్ర రైతుల మీద ఉంటే ఏ రైతుకి ఇలాంటి పరిస్థితి రాదు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడం మానేసి చివరి గింజ వరకు కొని సకాలంలో వారి డబ్బులు చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.