కొత్త అగ్రి చట్టాలతో రైతులకు నష్టం లేదు

మూడు వ్యవసాయ బిల్లుల వలన రైతులకు, వ్యవసాయ రంగానికి ఎటువంటి నష్టం వాటిల్లదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. రైతుల ఉత్పత్తికి రక్షణ కోసమే వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చారని, మార్కెట్‌ యార్డులు ఎత్తివేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ళు పట్టాలు ఇవ్వలేదని..కేవలం పొజిషన్‌ సర్టిఫికేట్‌లు మాత్రమే ఇచ్చారని పురంధేశ్వరి విమర్శించారు.విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడిన ఆమె. పోలవరం నుంచి తప్పుకోవడం లేదని..వెనక్కి తగ్గడం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు రాజధానికే తాము కట్టుబడి ఉన్నామన్నారు పురంధేశ్వరి.