రామచంద్ర యాదవ్ పై దాడిని ఖండించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ రైతు సభ నిర్వహించాలనుకున్న పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ పై దాడిని పితాని బాలకృష్ణ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఆదివారం రాత్రి వైసిపి రౌడీమూకలు రామచంద్ర యాదవ్ ఇంటిపై చేసిన దాడి దౌర్జన్యానికి పరాకాష్ట అని ఈ దాడిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. బీసీలను అన్ని విధాలుగా కాపాడుకునే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని తెలిపారు. ఇటువంటి దాడులు మళ్ళీ పునరావృతం అయితే తాము జనసేనపార్టీ చూస్తూ ఊరుకోబోమని పితాని బాలకృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పుండరీష్, గొలకోటి వెంకన్న బాబు, కడలి కొండ, గాలిదేవర బుల్లి, విత్తనాల అర్జున్, గొలకోటి సాయి, నాతి నాగేశ్వరరావు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.