జనసేనానికి జెడ్ కేటగిరి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని పితాని డిమాండ్

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ని గత మూడు రోజులుగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించడం దురదృష్టకరం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల రీత్యా ఆయనకు వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక వారిని ఏదో రకంగా అంతమొందించాలని ఆలోచన చేస్తున్న ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఏ విధమైన చెడు జరిగినా ఊరుకునేది లేదని, తక్షణం కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరఫున రాష్ట్ర రాజకీయాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పర్టీ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ డిమాండ్ చేశారు.