వనపర్తి జిల్లా కేంద్రంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

  • ప్రజలకు అండగా నిలుస్తూ నూతన రాజకీయ వ్యవస్థ కొరకై వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వనపర్తి నియోకవర్గ స్థానానికి జనసేన పోటీలో వుంటుంది
  • వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు

వనపర్తి నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 52వ జన్మదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించినట్టు జనసేన పార్టీ వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు తెలిపారు. పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహం దగ్గర నేస్తం ఫౌండేషన్ నిర్వహణలో జరిగిన రక్తదాన కార్యక్రమంలో 41 యూనిట్ల బ్లడ్ జనసైనికులు, అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం కేక్ కటింగ్ జరిపి ఘనంగా అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు మాట్లాడుతూ సమాజంలోని జనసేన యువత ప్రజలకు ఉపయోగపడే సేవలను అందిస్తూ మంచి ఆలోచనలతో సేవా భావంతో ముందుకు వెళ్లాలని కోరారు. రక్త దానం చేయడం వల్ల ఎంతో మందిని ప్రాణాపాయం నుంచి కాపాడిన వాళ్ళం అవుతామని, సాటి మనిషికి సాయం చేసే ఆలోచన విధానం అందరూ అలవరుచుకోవాలని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సేవాస్ఫూర్తితో ఆయన ఆశయాలను సిద్ధాంతాలను తీసుకొని జనసేన కార్యకర్తలు ముందుకు సాగాలని కోరారు. నూతన రాజకీయ వ్యవస్థ కొరకై అవినీతి మయమైన రాజకీయాన్ని ప్రక్షాళన చేసేందుకు జనసేన పార్టీ నేటి తరంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ తీసుకొస్తుందనీ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన యువకులకు ప్రాధాన్యత ఇస్తూ, సమాజ నవ నిర్మాణానికి పోరాడుతున్న యువతను ముందుకు తీసుకొస్తూ వారికే నాయకత్వాన్ని అందిస్తూ వాస్తవరూపంలో యువకులకు రాజకీయ అవకాశం కల్పిస్తుందని అందరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ సెక్రెటరీ బాలక్రిష్ణ మరియు పట్టణ అధ్యక్షులు సురేష్ యాదవ్, వనపర్తి మండల అధ్యక్షులు ఉత్తేజ్, గోపల్పెట్ మండల అధ్యక్షుడు మూర్తి నాయక్, జనసేన నాయకులు ప్రకాష్, శ్రీనివాసులు, గోపాల్, నరేష్, గణేష్, శ్యామ్,అభిలాష్, వెంకటేష్, శివ, రాజేష్, రమేష్, సురేష్ గౌడ్, రాము, నవీన్, వినోద్, రాజేష్ శేఖర్, నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు నరేష్ యాదవ్, సంబంధిత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.