భయం భయంగా విద్యాబ్యాసం

కోనసీమ జిల్లా, చింతలపల్లిలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల సుమారు వంద సంవత్సరాల క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేరుకున్నది. ఈ పాఠశాలలో 96 మంది విద్యార్థులు చదువు తున్నారు. శిథిలమైన పాఠశాలలోనే క్లాసులు కొనసాగుతున్నాయి. అప్పుడప్పుడు పాఠశాలపై కప్పు పెంకులు ఊడి పడిపోతుండడంతో విద్యార్థులు క్షణం క్షణం.. భయం భయంతో గడుపుతున్నారు. ఈ విషయాన్ని రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు కోరుతున్నారు.