మనవరాలి అభినయానికి ఫిదా

లాక్‌డౌన్ కారణంగా కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపతున్నారు. ముఖ్యంగా తన తల్లితో, మనవరాళ్ళతో చిరు సరదా సమయం గడుపుతున్నారు. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు అప్డేడ్స్‌ను తన అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా తన మనవరాలు సంహిత( చిరు పెద్ద కూతురు సుస్మిత కుమార్తె) రుద్రమదేవి సినిమాలోని డైలాగ్‌ను గాంభీర్యంగా, రాజసంతో చెబుతుంటే ఆ సన్నవేశాలని తన మొబైల్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సంహిత డైలాగ్‌లోనే కాదు యాక్షన్ పరంగా అద్భుత ప్రతిభ కనబరిచింది. దీంతో మనవరాలి పర్‌ఫార్మెన్స్‌కు ముగ్ధుడైన చిరు.. “1990లో సుష్మిత, 2020లో సంహిత పరంపర కొనసాగుతోంది. అచ్చంగా తల్లిలాగే కూతురు” అంటూ చిరు ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారుల అభిరుచిని తల్లి తండ్రులు ప్రోత్సహిస్తే, అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు.