బతుకమ్మ చీరలు పంపిణీ

గ్రేటర్‌ పరిధిలోని 993 కేంద్రాల ద్వారా 30 సర్కిళ్లలో 15,38,742 మందితెలంగాణా ఆడపడుచులకు నేటి నుంచి (శుక్రవారం) బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. తొలుత కూపన్లు ఇస్తామని, తెల్ల రేషన్‌ కార్డు కలిగి, 18 ఏండ్లు నిండిన వారందరికీ చీరలు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. కాప్రాలో 60584, ఉప్పల్‌లో 49663, హయాత్‌నగర్‌లో 35533, ఎల్బీనగర్‌లో 39121, సరూర్‌నగర్‌లో 34877, మలక్‌పేటలో 49373, సంతోష్‌నగర్‌లో 67000, చాంద్రాయణగుట్టలో 61114, చార్మినార్‌లో 46610, ఫలక్‌నుమాలో 62413, రాజేంద్రనగర్‌లో 72751, మెహిదీపట్నంలో 49483, కార్వాన్‌లో 62016, గోషామహల్‌లో 51542, ముషీరాబాద్‌లో 59562, అంబర్‌పేట్‌లో 60480, ఖైరతాబాద్‌లో 28506, జూబ్లీహిల్స్‌లో 32250, యూసుఫ్‌గూడలో 55313, గచ్చిబౌలిలో 21481, చందానగర్‌లో 29005, ఆర్సీపురం-పటాన్‌చెరులో 29325, మూసాపేట్‌లో 64104, కూకట్‌పల్లిలో 63825, కుత్బుల్లాపూర్‌లో 64926, గాజులరామారంలో 62755, అల్వాల్‌లో 25702, మల్కాజిగిరిలో 62400, సికింద్రాబాద్‌లో 60580, బేగంపేటలో 33851, కంటోన్మెంట్‌లో 42597 కలిపి మొత్తం 15,38,742 చీరలను పంపిణీ చేస్తామని అధికారులు వివరించారు.