బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మెగా బ్రదర్ ..!

లాక్ డౌన్ తర్వాత  సినిమాలు తగ్గించిన మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల కాలంలో నాగబాబు డిఫరెంట్ లుక్స్ తో ఉన్న ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ..ఆడియెన్స్ ను ఆశ్చర్య పరుస్తున్నారు. త్వరలో నాగబాబు బాలీవుడ్ అరంగేట్రానికి రెడీ అవుతున్నారని ఫిలింనగర్ సర్కిల్‌లో వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

వివి వినాయక్ డైరెక్షన్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో నాగబాబు నెగెటివ్ రోల్‌లో కనిపించబోతున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. నాగబాబు బీటౌన్ ఎంట్రీపై రీమేక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పలువురు బాలీవుడ్ భామల పేర్లు తెరపైకి వచ్చినా..బెల్లంకొండతో ఎవరు రొమాన్స్ చేయబోతున్నారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.