ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి జనసేన నాయకుల ఆర్థిక సహాయం

ముమ్మిడివరం నియోజకవర్గం: గేదెల్లంక గ్రామానికి చెందిన కోన సుబ్బారావు కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని భేరి శ్రీను ద్వారా తెలుసుకున్న సూరపరెడ్డి సురేష్ శనివారం జనసేన నాయకులు దంగేటి శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా యోగా ప్రసాద్ టీం మరియు శ్రీహరి సహకారంతో ఆ నిరుపేద కుటుంబానికి ముమ్మిడివరం జనసేన నాయకులు గుద్దటి జమ్మి మరియు గోదసి పుండరీష్ చేతుల మీదుగా 6000 ఆర్థిక సహాయం మరియు కూరగాయలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు గాలి దేవర బుల్లి, దూడల స్వామి, సలాది శివ, కోన బాబ్జి, నామన నానాజీ, గాలిదేవర రాము మరియు స్థానికులు పాల్గొన్నారు. దీనికి గాను ఆ కుటుంబ సభ్యులు శ్రీహరి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. దయచేసి దాతలు ఎవరైనా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు.