పలు ప్రమాదాల్లో గాయపడిన వారికి జనసేన నాయకుల ఆర్థిక సహాయం

విజయవాడ: పలు ప్రమాదాల్లో గాయపడిన ఇరువురకు కొన్ని కారణాల వల్ల ఇన్సూరెన్స్ రాకపోవడం చేత.. అమ్మిశెట్టి వాసు మరియు డివిజన్ అధ్యక్షులు ముత్యాల కృష్ణ ద్వారా విజయవాడ ఈస్ట్ ఐటీ కో-ఆర్డినేటర్ మేకల అనిల్ కుమార్ ఆర్థిక సహాయం అందించారు. వివరాలలోనికి వెళ్ళగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన కె.వెంకట రాంమూర్తి, మరియు ప్లంబింగ్ వర్క్ చెస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి పడిపోయిన సంకు రమేష్ బాబు గత సంవత్సరం పలు ప్రమాదాల్లో గాయపడ్డారు. వీరికి పార్టీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు పొందుపరిచి అప్లై చేయడంలో కొంత ఆలస్యం జరగడంతోఇన్సూరెన్స్ అందకపోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన విజయవాడ ఈస్ట్ ఐటీ కోఆర్డినేటర్ మేకల అనిల్ కుమార్.. పార్టీ అధినేత పవన్కళ్యాణ్ స్ఫూర్తి తో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ అమ్మిశెట్టి వాసుకి విషయం తెలియ పరిచి వారి ద్వార మరియు డివిజన్ అధ్యక్షులు ముత్యాల కృష్ణ ద్వారా క్షతగాత్రులు ఇరువురకు చెరొక 25000 మొత్తంగా 50వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.