జనసేనాని జన్మదినాన అంధ దంపతులకు ఆర్ధిక సాయం

  • ఆమదాలవలసలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఆమదాలవలస నియోజకవర్గం: సరుబుజ్జిలి మండల నాయకులు, జనసైనికులుతో కలిసి మండల అధ్యక్షుడు పైడి మురళి మోహన్ ఆధ్వర్యంలో శనివారం జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జనసేన సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం దృష్టిలో పెట్టుకొని సరుబుజ్జిలి మండల పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలకు మొక్కల పంపిణీ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులతో మొక్కలు నాటి వారికి పర్యావరణ మీద అవగాహన మరియు జనసేన సిద్ధాంతాలలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ సిద్ధాంతాన్ని పెట్టరో అని వివరించడం జరిగింది. జనసేన అధినేత స్ఫూర్తితో సాయంత్రం జనసైనికులు, కార్యకర్తల సహకారంతో పాలవలస గ్రామానికి చెందిన అంధులైన గొంటి వెంకట రమణ, గోంటి శారద దంపతులకు నెలకు సరిపడా నిత్యవసర సరుకులు మరుము 13,500 రూపాయిలు ఆర్ధిక సాయం ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు చేతులు మీదగా ఇవ్వడం జరిగింది.