అప్పుకి ఎక్కడికెళ్ళాలా అని కాకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి: కీర్తన

చిత్తూరు జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరి కీర్తన మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టాల్సిన దృష్టి, అప్పులు ఎక్కడ పుడతాయి అనే దాని పైన పెట్టారు.పాలకులు ప్రజా సమస్యల పైన పోరాడకుండా వ్యక్తిగత దూషణలలోనే కాలయాపన చేస్తూ ఉన్నారు. మీ విలువైన సమయాన్ని రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టి ఉంటే ఈ రోజు మనం అప్పు అడుక్కునే స్థితిలో ఉండే వాళ్ళం కాదని. ప్రభుత్వ ఆస్థులను అమ్మి ఉద్యోగులకు జీతాలను ఇద్దామని ఆలోచిస్తున్నారే తప్ప కంపెనీలు రాష్ట్రానికి ఎలా తీసుకురావాలని కాని యువతకు ఉపాధి కల్పించాలని కాని అస్సలు ఆలోచించడం లేదు. కేవలం ఒక వర్గాన్ని ఓటు బాంకులా చేసుకోవడనికి సంక్షేమ పధకాల మీద శ్రద్ధ పెడుతున్నారే తప్ప ఆదాయ వనరుల్ని సమకూర్చాలనే అంశాల గురించి అస్సలు ఆలోచించట్లేదని ధ్వజమెత్తారు.