రైతుభరోసా, రైతుబంధు పథకాలవల్ల కౌలు రైతుకేంటి ఉపయోగం..?

మొత్తంమీద 70% కౌలు రైతులే వారికి ఈ పథకాలు వర్తించవు. ప్రభుత్వాలు నిజంగా చిత్తశుద్ది వుంటే చేయాల్సింది ఎరువులు ధరలు తగ్గించడం, కల్తీ విత్తనాలు అరికట్టడం, పురుగుమందుల రేట్లు తగ్గేలా చేయడం, పండించి పంటకు గిట్టుబాటు ధరలు కల్పించడం
చేయగలిగితే నిజంగా ఎవరైతే ప్రత్యక్ష వ్యవసాయం చేస్తారో వారికి లబ్ధి జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఎక్కడా భూసాములు ఆత్మహత్యలు చేసుకోరు నష్టం వస్తే భూమి అమ్మి అయినా నిలబడగలడు కానీ కౌలురైతుకి ఏ ఆధారం ఉండదు కనుక ప్రాణత్యాగం చేసుకుంటున్నాడు. ఇక్కడ తప్పకుండా పాలక విధానాన్ని తప్పుపట్టక తప్పదు. రైతు బంధువు అని ప్రకటనలు చేస్తే సరిపోతుందా? అవలింబించాలి. అన్నం పెట్టే అన్నదాత ఉసురు తప్పక తగులుతుంది. ఉత్పత్తి వ్యయం పదేళ్ళలో మూడు రెట్లు పెరిగింది పంట ధర అలాగే ఉంది ఏలినవారు గ్రహించి రైతు ఆత్మహత్యలు జరగకుండా కాపాడాలి. అప్పుల భాదలు తాళలేక రాష్ట్ర వ్యాప్తంగా 380 కి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా నేనున్నానని రేపు అనంతపురం జిల్లానుండి రైతు భరోసా యాత్ర మొదలు పెడుతూ చనిపోయిన రైతు కుటుంబానికి లక్ష చప్పున తన సొంత డబ్బు అందిస్తూ… అన్నదాత కుటుంబానికి బాసటగా నిలుస్తున్న జనసేనానికి ఒక కౌలు రైతుగా జనసేన పశ్చిమగోదావరి జిల్లా నాయకుడిగా పాదాభివందనాలు అని పోలవరం నియోజకవర్గ జనసేన నాయకులు పాదం నాగకృష్ణ అన్నారు.