నవులూరి లక్ష్మీగీత పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఆహారం పంపిణీ

కొండెపి: శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా, పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బుదవారం నవులూరి లక్ష్మీ గీత అనే ఆరు సంవత్సరాల పాప పుట్టినరోజు సందర్భంగా కందుకూరులో శివాలయం, అంకమ్మ స్వామి దేవాలయం, మరియు బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి అనాధలకు, యాచకులకు, పేదలకు మరియు వృద్ధులకు దాదాపు 40 మందికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది, శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రవ్వ శ్రీనివాసులు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ఎంతోమంది పేదల యొక్క ఆకలి బాధలు తెలుసుకున్న వ్యక్తి, సేవా హృదయం గల మంచి మనసున్న మనిషి, అనాధల యొక్క ఆకలి తీరుస్తూ వారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్న గొప్ప మనసున్న మహారాజు రవ్వ శ్రీనివాసరావు, అదేవిధంగా శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ శ్రీరామ సాయిబాబా హెల్పేర్ సొసైటీకి దాతలు సహకరించాలని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ ఆహార పంపిణీ కార్యక్రమంలో రవ్వ శ్రీనివాసరావు, కనపర్తి మనోజ్ కుమార్, చీదెళ్ల కృష్ణ మొదలైన వారు పాల్గొన్నారు.