ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలంటే అరాచక వైసిపి ప్రభుత్వం పోవాలి!

  • బీసీలకు రాజ్యాధికారం వారి సాధికారిక కోసం పవన్ కళ్యాణ్ గారు పరితపిస్తున్నారు!
  • ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అవినీతి వైసీపీకి ఓటేసిన పాపానికి ఇప్పుడు కుమిలిపోతున్నారు!
  • రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అవినీతి తారాస్థాయికి చేరింది!
  • జనం కోసం జనసేన” ‘మహాపాదయాత్ర’.. రాజానగరం మండలం, పాలచర్ల గ్రామంలో జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి ప్రజల నుండి విశేష స్పందన!
  • అడుగడుగునా హారతులు ఇస్తూ.. శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి ఘన స్వాగతం పలికిన పాలచర్ల గ్రామ ప్రజానీకం!

రాజానగరం: పాలచర్ల గ్రామంలో నిర్వహించిన ‘జనం కోసం జనసేన’ ‘మహాపాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జనసేన పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేసి పాలచర్ల గ్రామాన్ని పూర్తిగా జనసేన మయం చేశారు!. శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న ఈ వైసీపీ సర్కార్ను ప్రజలందరూ ఐక్యమై త్వరగా ఇంటికి పంపాలని, సమాజానికి ఎంతో చేయాలని పరితపిస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడికి ఒక అవకాశం ఇచ్చి, ప్రజలందరూ ఆశీర్వదించి జనసేన పార్టీని గెలిపించాలని అభ్యర్థిస్తూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ పాదయాత్రలో పాలచర్ల సీనియర్ జనసేన నేతలు, జనసైనికులు, వీరమహిళలు అలానే మండలంలోని ఇతర జనసేన నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.