గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన జనసేన నాయకులు

అరకు నియోజకవర్గం, జనం కోసమే జనసేన మాటలు ప్రజల్లో తీసుకెళ్లే భాగంగానే గురువారం ఉదయము జనసేన ఎక్స్ ఎంపిటిసిసాయి బాబా, దురియా సన్యాసిరావు, గెమ్మెలి, కొండప్ప ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించి, గిరిజనులతో సమావేశమై, ఆయా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పట్ల చర్చించారు, ఈ సందర్భంగా సాయిబాబా, దురియా సన్యాసిరావు, గెమ్మెలి, కొండప్ప తదితరులు మాట్లాడుతూ గ్రామంలో మంచినీరు వారం రోజుల నుండి అందకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు ప్రభుత్వ సంబంధిత అధికారులుకు తెలియదా…? అని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు గ్రామాల్లో ఉన్న సోలార్ మరమ్మతు అవడంవల్ల గిరిజనులకు మంచినీరు అందని ద్రాక్ష వల్లే ఉందని, తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని గ్రామాల్లో వెళ్ళి సోలార్ మరమ్మతులు చేపట్టి గిరిజనులకు మంచినీటి సౌకర్యం కల్పించగలరని ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పట్టా పేరుతో డబ్బులు వసూలు చేసే విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ప్రజల తరఫున ప్రభుత్వానికి సూచించారు. అనంతరం టిడిపి వైసిపి కార్యకర్తలను జనసేన పార్టీలోకండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు, ఒక పార్టీలో చేరిన వారిలో కొర్ర జగన్నాథ్ రావు, జర్నీ అప్పలస్వామి కొర్ర, సింహాద్రి కోనేపు, రమేష్ కుర్ర భీమన్న జర్నీ సోమన్న తదితరులను అధిక సంఖ్యలో పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జనసేన బృందం ఆధ్వర్యంలో మరమ్మతులో ఉన్న సోలార్ ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎక్స్ ఎం పి టి సి సాయి బాబా, దూరియ, సన్యాసిరావు, గెమ్మెలి మరియు జనసైనికులు పాల్గొన్నారు.