తెలుగు రాష్ట్రాల భవిష్యత్ కోసమే ఆవిర్భావ సభ: కామిశెట్టి రమేష్

రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని.. బడుగు బలహీన వర్గాల ప్రజలు.. సామాన్య ప్రజలు ఎన్నడూ లేని విధంగా కష్టాలు పడుతున్నారని.. వీటన్నింటి నుండి ప్రజలు విముక్తి పొంది.. అధికార పార్టీ కి చరమగీతం పాడేందుకే.. ఈ భారీ సభతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాంది పలికారని పిడుగురాళ్ల పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామిశెట్టి రమేష్ అన్నారు. ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఎన్నికల శంఖారావానికి నాంది పలుకుతారని చెప్పారు. మండలం నుండి భారీగా వీర మహిళలు, జన సైనికులు, కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారని.. ఈ యొక్క సభని అడ్డుకోవాలని శత విధాలుగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. అయినా మేము ఈ సభని విజయవంతం చేస్తామని రమేష్ చెప్పారు.

ఒక్క చాన్స్ అంటూ గద్దెనెక్కి ప్రజల నడ్డి విరుస్తున్న ఈ అప్పుల ప్రభుత్వాన్ని గద్దె దించడానికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభ తో నాంది పలుకుతారని. జనసేన నాయకుడు నూతి సూర్యనారాయణ అన్నారు.

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమస్యలను పరిష్కార దిశగా తీసుకెళ్లడమే లక్ష్యంగా జనసేన పార్టీ స్థాపించారని.. 9వ ఆవిర్భావ సభ ద్వారా అధికార ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుట్టించి అధికార స్థాపన దిశగా ముందుకెళ్తారని.. పేడ కొలిమి కిరణ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, జనసైనికులు బయ్యవరపు రమేష్, గుర్రం కోటి బ్రదర్స్, బేతంచర్ల నాగేశ్వరరావు,పెద్దకొలిమి కిరణ్, కామిశెట్టి అశోక్, కోసూరి శ్రీకాంత్ ఆదిత్య, రామంజి, అడపా వెంకట్ మరియుకార్యకర్తలు పాల్గోన్నారు.