ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తథ్యం: ఏపీ శివయ్య

చిత్తూరు, 2024 ఎన్నికలలో కేంద్రంలో ఎన్డీఏ కూటమికి 470 ఎంపీ స్థానాలతో మరియు ఆంధ్రప్రదేశ్లో 125 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని ఏపీ శివయ్య తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతుందని విమర్శించారు. ప్రజాస్వామ్య పాలనకి జనసేన-బీజేపీ-టిడిపి పార్టీలతోనే సాధ్యమని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ ప్రజాస్వామ్య పొత్తుని స్వాగతిస్తున్నారు అని తెలిపారు. అన్ని వర్గాలను, ప్రాంతాలను, మతాలను కలుపుకొని పోయి అభివృద్ధిలోనూ, రాజకీయ పదవుల్లోనూ రాబోయే ఉమ్మడి ప్రభుత్వం భాగస్వాములుగా చేస్తుందని ఏపీ శివయ్య పేర్కొన్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.