రంగా వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

పల్నాడు జిల్లా, స్వర్గీయ వంగవీటి మోహనరంగా 35వ వర్ధంతి సందర్భంగా డా.శింగరాజు సాయికృష్ణ, డా.శింగరాజు విద్యల ఆధ్వర్యంలో నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత వైద్య శిబిరంలో భాగంగా సుమారు 500 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేయడం జరిగింది. ఉచిత వైద్య శిబిరం అనంతరం రంగా విగ్రహానికి నివాళులర్పించి 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.