డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

పిఠాపురం నియోజకవర్గం కొలంక గ్రామం నందు జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉచిత మెగా వైద్య శిబిరం నందు 600 పైచిలుకు కొలంక గ్రామ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు వైద్య సేవలు ఉచితంగా పొందడం జరిగింది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు బిపి షుగర్ ఆక్సిజన్ మొదలగు పరీక్షలు నిర్వహించి సంబంధిత వైద్యులచే జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిషన్, గైనకాలజిస్ట్, మొదలగు డాక్టర్ లచే పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఉచిత సేవలు అందించడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ వైద్యరంగంలో ఉంటూ అనేక మంది పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ, వైద్యరంగంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉందని, ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉండటమే కాకుండా ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ జగన్ ప్రభుత్వం ఉండడం దౌర్భాగ్యమని, పేద ప్రజలకు అందాల్సిన వైద్యం ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయించాల్సిన ధనాన్ని తాడేపల్లి ప్యాలెస్ లో అక్రమార్కులచే దోచుకుంటూ ప్రజాధనాన్ని సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, జనసేన పార్టీ రాజకీయ పార్టీగానే కాకుండా ప్రజలకు సేవచేయడంలో కూడా ముందుంటుందని జనసేనపార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలమేరా వారి సేవా దృక్పథంతో అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. అనేకమంది ప్రజలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాలలో ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు అనేక మంది ఈ ఉచితంగా మెగా వైద్య శిబిరంలోని సేవలను ఉపయోగించుకుని ఉచితంగా మందులు కూడా పొందడం జరిగింది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకంగా ప్రజలకు కావాల్సిన న్యాయపరమైన అనేక పోరాటాలు చేస్తూ ఈరోజుకి ప్రజల సేవలో అందుబాటులో ఉంటూ ఈరోజు కొలంక గ్రామ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఈ ఉచితంగా మెగా వైద్య శిబిరం ద్వారా సేవలు అందించడం జరిగింది అని ఇకమీదట ముందు ముందు కూడా అనేక ఉచిత మెడికల్ క్యాంపు ల ద్వారా నియోజకవర్గంలో పాలు ప్రాంతాలకు వెళ్లి సేవలు అందించడం జరుగుతుందని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిరియాల మంగరాజు, కరెడ్ల పద్మరాజు, శీలపు అదిబాబు, నంద్యాల నాగబాబు, శ్రీపతి సుబ్రహ్మణ్యం, జన్యాసుల సుబ్బారావు, కేతినీడి గౌరీనగలక్ష్మి, రాలింగి సుబ్రహ్మణ్యం, కారణం హరీష్, నర్ల సతీష్, మిరియాల సందీప్, నంద్యాల మణికంఠ, నంద్యాల సురేష్, చెల్లపు ఏసుబాబు, ఎక్స్ సర్పంచ్ గరగా సత్యానందరావు, దుడ్డు రాంబాబు, రావుల వీరభద్రరావు, అల్లం అయ్యప్ప, బోజ్జ గోపికృష్ణ, గొల్లపల్లి శివ, ఇంటి బాబు, వీరం రెడ్డి అమర్, మోటూరి మహేష్, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.