రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

ఏలూరు, జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక 14 వ డివిజన్ సాయి నగర్, శివ నగర్, గణేష్ కాలనీలో ఆశ్రమం వైద్యుల సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరంలో ఆశ్రమ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వినీత జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ వైద్యులు డా.అచ్యుత రామస్వామి, కంటి వైద్య నిపుణులు డాక్టర్. నాగఆకిల, కంటి వైద్య నిపుణులు అనురాగ్, ప్రసూతి వైద్యులు డాక్టర్ విష్ణువర్ధని, వైష్ణవి రోగులను పరీక్షించి మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి, బలహీన వర్గాల ప్రజలకు ఆరోగ్యం పట్ల భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో పార్టీ అధినేత సూచనల మేరకు ఏలూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలను తీసుకొని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశి నరేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, నాయకులు బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, కర్ర తవిటిరాజు తదితరులు పాల్గొన్నారు.