వాలంటీర్ల చేత పార్టీ పనులా…?: కార్పొరేటర్ మలగా రమేష్

ఒంగోలు, ప్రభుత్వ పరిధిలో ఉద్యోగాలు చేస్తున్న వాలంటీర్ల చేత జగన్ ప్రభుత్వం పార్టీ కార్యక్రమాలు చేపించడం ఎంత వరకు సబాబు అని జనసేన ఒంగోలు నగర అధ్యక్షులు, 38వ డివిజన్ కార్పొరేటర్ మలగా రమేష్ ప్రశ్నించారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే పార్టీ కార్యక్రమాన్ని వాలంటీర్ల చేత చేయించడం విడ్డూరంగా ఉందని బుధవారం పత్రికా ప్రకటన ద్వారా ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. వాలంటీర్లు గడప గడపకు తిరుగుతూ ప్రతీ ఇంటికి స్టిక్కర్లు అంటిస్తున్నారని దుయ్యబట్టారు. ఇంటి యజమానికి ఇష్టం ఉన్నా లేకున్నా స్టిక్కర్లను అంటించి వెళుతున్నారని, ఇదెక్కడి సోద్యమని అశ్చర్యానికి లోనైయ్యారు. మా డివిజన్ 38లో కూడా ఇలానే జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పరిధిలో పని చేస్తున్న వాలంటీర్ల చేత పార్టీ కార్యక్రమాలు చేపట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ సర్కార్ ప్రజల్లోకి వెళ్లేందుకు అనేక దొడ్డి దారులు ఎంచుకుంటుందన్నారు. ప్రజలు గమనించాలని, జగన్ సర్కార్ ఛీప్ ట్రిక్స్న తిప్పికొట్టాలని మలగా పిలుపునిచ్చారు.