పోలీస్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ అందించనున్నది. ఈసారి అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో శిక్షణ అందించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌ ప్రకటించింది. ఆసక్తికలిగిన బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు tsbcstudycircle. cgg.gov.in నుంచి ఫారం డౌన్‌లోడ్‌ చేసుకొని ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన వారికి రూ.2లక్షలు మించకూడదని పేర్కొన్నది. వివరాలకు 040-24071178, 63024 27521 నెంబర్లను సంప్రదించాలని సూచించింది.