శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో మంచినీళ్ళ చలివేంద్రం

గుంటూరు, 16వ డివిజన్ ఏటుకూరు గ్రామంలో 16వ డివిజన్ జనసేన కార్పొరేటర్ దాసరి లక్ష్మీదుర్గ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద వేసవికాలం దృష్ట్యా మంచినీళ్ళ చలివేంద్రం ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, ఏటుకూరు గ్రామ పెద్దలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగినది.