శ్రీమతి ప్రమీల కి కడప జిల్లా మెగా డిజిటల్ ఆర్మీ చిరు సత్కారం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికైనా శుభసందర్భంగా శ్రీమతి ప్రమీలకి కడప జిల్లా మెగా డిజిటల్ ఆర్మీ అధ్యక్షులు పండ్రా రంజిత్ కుమార్ అధ్యక్షతన సిటీ అధ్యక్షులు అతికారి నాగేంద్ర చిరు సత్కారం చేయడం జరిగింది. అనంతరం పండ్రా రంజిత్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షులు అతికారి నాగేంద్ర, పండ్రా రుక్మిణి, చిన్నా జనసేన పాల్గొన్నారు.