కొండయ్యపాలెంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ కు హామీ యాత్రా కార్యక్రమం అగ్రహారం సతీష్ ఆధ్వర్యంలో 45వ డివిజన్ కొండయ్యపాలెంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయన్నారు. అసలు నిర్మాణరంగం అంటే దానిలో అనేక రకాల విభాగాలతో పేద కార్మికులకు ఒక కర్మాగారంలాంటిదనీ అలాంటి రంగాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి అతలాకుతలం చేసాడనీ ఈ దెబ్బకి ఆరంగంపై ఆధారపడిన కార్మికులు రోడ్డున పడి ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. పైగా సిగ్గులేకుండా ఉచిత ఇసుక వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం వాటిల్లిందని ఆనాటి ప్రభుత్వ అధినేతపై కేసులు పెట్టడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వపాలన అంటే తెలియదని ప్రజలకి అర్ధమైందన్నారు. ప్యాలెస్ జీవితానికి అలవాటు పడిన వాళ్ళకి పేద ప్రజల కష్టాలు ఎలా కనపడతాయి, అర్ధమవుతాయని విమర్శించారు. తమ జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి పాలనలో భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తొలగేలా చర్యలు ఉంటాయని తెలిపుతూ తమకి మద్దతు ఇవ్వవలసినదిగా అర్ధించారు. ఈ కార్యక్రమంలో సతీష్, నగేష్, దుర్గా, వాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.