గొడారిగుంట ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్రా కార్యక్రమం గురువారం టి.వి.వి సత్యన్నారాయణ ఆధ్వర్యంలో 9వ డివిజను గొడారిగుంట పెట్రోలు బంకు వెనుక ప్రాంతంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు భవన నిర్మాణ కార్మికులు కటారి శ్రీను, నక్కా వెంకన్న, జెట్టి విజయ్, ములికి నల్ల బాబు, గుర్రాల జాన్, రత్నకిషోర్ తోను అక్కడున్న వారితో మాట్లాడి వారి కష్టసుఖాలపై వివరాలపై ఆరాతీసారు. అసలే చాలీ చాలని బతుకులనీ దానికి తోడు ఈ వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఇసుక దొరక్క, దొరికితే అత్యధిక ధరల వల్ల నిర్మాణ పనులు చాలా తక్కువగా ఉంటున్నాయనీ బతుకు చాలా భారమైందని కార్మికులు వాపోయారన్నారు. ఈ ముఖ్యమంత్రికి భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు వినపడవనీ ఎందుకంటే ఆయన ఆకాశంలో హెలీకాప్టర్ ఎగురుతుంటే కిందనుండీ వీళ్ళు ఎక్కడ కేకలేస్తారో అని బారికేడ్లు పెట్టి నియంత్రిస్తున్నారన్నారు. గోదావరీ పరివాహక ప్రాంతంలో ఉన్నాకూడా ఇలా ఇసుకకి కటకటలాడటం వై.సి.పి ప్రభుత్వ అరాచకమేనన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.