టీడీపీ రిలే నిరహార దీక్షకు అరకు జనసేన మద్దతు

అరకు నియోజకవర్గం: హుకుంపేట మండలం, మత్యపురం పంచాయతీ, ఉప్ప గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన రిలే నిరహార దీక్షకు అరకు నియోజకవర్గం హుకుంపేట మండల జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బలిజ కోటేశ్వరరావు పడాల్ మాట్లాడుతూ నేటికి వైసీపీ ప్రభుత్వం వివేకానందరెడ్డి హత్య, బండెడు అవినీతి కేసులున్న వ్యక్తులపై ఎందుకు కేసులు త్వరగా విచారణలోకి రావట్లేదు, ప్రతిపక్షాలు గొంతెత్తి ప్రశ్నిస్తే సక్రమంగా జరిగిన విషయాన్ని అక్రమంగా అవినీతి మయంగా జరిగినట్టు బూచిగా చూపి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చెయ్యడం ఇప్పటికి వయసు దృష్టిలో చూసైనా బెయిల్ లభించకపోవడం చూస్తుంటే ప్రభుత్వం ఎంతటి కక్షసాధింపు చేస్తుందో గమనించవచ్చు వ్యవస్థలు మేనేజ్ చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక విషయం తెలుసుకోవాలి ప్రతిపక్ష పాత్ర పోషించే వారు ప్రజాభివృద్ధి తోడ్పడేవారు. రాజకీయాలు హుందాతనం కోల్పోయింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ విషయం ప్రజలకు తెలుసు ఏది ఏమైనా తెదేపా అధినేత వాస్తవ విషయాలు క్షున్నంగా ప్రజలకు తెలియజేస్తారు కచ్చితంగా ప్రభుత్వ కుట్ర బట్టబయలు చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి మీ ప్రతీకారం తీర్చుకోవడానికి మీకు ప్రజలు అధికారం ఇవ్వలేదు మీ పతనం త్వరలోనే కచ్చితంగా జరుగుతుంది. రానున్న ఎన్నికల అనంతరం మీరు ఎక్కడుంటారో ఇప్పటికే దేశ ప్రజలు ఒక అంచనకొచ్చేశారు. ఇకపైన మీకు ఇటువంటి కడప పాక్షన్ రాజకీయాల దుర్బుద్ధి మానుకోండి మీకు బెయిల్ రద్దు అయితే పరిస్థితి ఏమిటో మీకే తెలియని అయోమయ స్థితి అంటూ తీవ్ర విమర్శలు చేసారు. మజ్జి క్రిష్ణంరాజు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది ఇటువంటి నిరంకుశ రాజకీయాలు ఇంతుకుముందెన్నడు చూడలేదు ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు మరీ అతన్ని ఏ జైల్లో పెట్టాలి సహజంగానే నేర ప్రవుత్తి స్వభావం కలిగిన వ్యక్తి నుంచి అభివృద్ధి ఆశించడం ప్రశ్నించడం చేస్తే ఎం లాభం లేదు కచ్చితంగా ఈ ప్రభుత్వం పోయాక వీళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తే ఏమి జరుగుతుందో వీళ్ళకి తెలుసు కానీ ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ కేవలం ప్రతికరలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు తప్పితే పూర్తిగా ప్రజాపాలన వైపు మాత్రం కాదని ఈ తీరు మార్చుకోవాలని గిరిజన వైసీపీ ప్రజాప్రతినిధులు ఈ విషయాలు తెలుచుకుని గిరిజన ప్రజల సంక్షేమం కోసం ఆలోసించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహక సభ్యులు పరదాని సురేష్, మండల నాయకులు సురకత్తి రాంబాబు, బూడిద నాగరాజు, దుడ్డు శోభన్ బాబు, శోభ రాంబాబు దొర, సింబోయి పరశురాం వైస్ ప్రెసిడెంట్, రాప బుద్దు, జన్ని లింగన్న, జన్ని సతీష్, ప్రసాద్, మజ్జి మహేష్, అప్పలరాజు, సునీల్ శొనభ, అర్జున్ శోభ, పోడెల బుజ్జిబాబు, బస్వన్న మరియు జనసైనికులు యాబై మందికి పైగా పాల్గొని అక్రమ అరెస్ట్ ను ఖండించి సంఘీభావం తెలపారు.