ల్యాండ్ టైటలింగ్ ఆక్ట్ పై న్యాయవాదుల పోరాటానికి గాదె సంఘీభావం!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ -(27/2023) ను రద్దు చేయాలని న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్ష 30 రోజుల నుంచి నిరవధికంగా గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరుగుతుంది. గురువారం జనసేన పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022 రద్దు కోసం చేస్తున్న దీక్షలకు మద్దతుగా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని వారు చేస్తున్న దీక్షకు పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ రోజు దీక్షలో పాల్గొన్న న్యాయవాదులు శ్రీకృష్ణయ్య, హనుమంతరావు, కోటేశ్వరరావు, బండ్ల గోపి, అశోక్ కుమార్, సురేష్, శ్రీనివాస్, సాయి చందు, సాయి శ్రుతి, జ్ఞానేశ్వరి, నిర్మల, అడపా.శిరీష్, శ్రీనివాస రావు, శ్రీరాములు, విజయ్ ప్రతాప్. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా.మాణిక్యాలరావు, శిఖా బాలు, మధు లాల్, నరసింహారావు, యడ్ల వెంకటేశ్వరరావు, కదిరి సంజయ్, చింతా శివ, హుస్సేన్, పతెళ్ళ మల్లి, తిరుమలశెట్టి నరసింహారావు.