పిచ్చటూరు మండలంలో గడప గడపకి జనసేన

చిత్తూరు జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, పిచ్చటూరు మండలంలోని ఓబుళరాజు కండ్రిగ మరియు గిరిజన కాలనీ నందు జిల్లా సంయుక్త కార్యదర్శి తడ శ్రీనివాసులు మరియు మండల ముఖ్య నాయకులు సుగంధర్ పిలుపు మేరకు జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ ముఖ్య అతిథిగా పాల్గొని గడప గడపకు జనసేన సిద్దాంతాలను తెలియచేస్తూ గిరిజన వృద్దులకు దుప్పట్లు, చిన్న పిల్లలకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి అంజూరు చక్రధర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేసి, 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుబ్రమణ్యం రాఘవేంద్ర, కోదండ రామయ్యా, పోలయ్యా, దాము, స్టీపన్, రమేష్, చిరంజీవి, మునిష్, మనోవా,గాంధీ, షామ్, ఆగస్తీన్, అమృత్, మారయ్య, మహేశ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.