సేవారత్న జాతీయ అవార్డుకి ఎంపికైన గాదె పృథ్వి

  • ఈనెల 15న న్యూఢిల్లీలో అవార్డు అందుకోనున్నట్లు వెల్లడి.

తెలంగాణ, స్టేషన్ ఘనపూర్, సేవారత్న జాతీయ అవార్డు-2023 కు జనసేనపార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వి ఎంపికైనట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన ఎంపిక పత్రాన్ని హైదరాబాదులోని జాతీయ కార్యాలయంలో గాదె పృథ్వికి అందజేశారు. బహుజన వర్గాల ప్రజా ఉద్యమకారులు, సంఘసేవకులు, రచయితలు, కవులకు సేవలను గుర్తించి అవార్డు ప్రతి సంవత్సరం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యావంతుడైన యువనాయకుడు, ప్రజాసేవ చేస్తూ కరోనా సమయంలో చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును పృథ్వికు అందజేసినట్లు వారు తెలిపారు. ఈనెల 15న న్యూఢిల్లీ లో జరిగే ఆల్ ఇండియా బహుజన రైటర్స్ 4వ జాతీయ సమావేశంలో దేశంలోని 27 రాష్ట్రాల నుండి 1000 మంది ప్రతినిధులు పాల్గొననున్న కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గాదె పృథ్వి మాట్లాడుతూ జాతీయ సేవారత్న అవార్డుకి తనను ఎంపిక చేసినందుకు బహుజన సాహిత్య అకాడమీ బాధ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ స్ఫూర్తితో రానున్న రోజులలో మరింత చురుకుగా పనిచేస్తానని తెలిపారు.