కాకుమాను మండలంలో అంగన్వాడిల దీక్షకు గాదె సంఘీభావం

గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం: కాకుమాను మండలంలో అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న దీక్షకు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. అంగన్వాడి టీచర్స్, వర్కర్స్ వారు చేస్తున్న డిమాండ్లు సమంజసం అని, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీలేనని, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పే ఈ ముఖ్యమంత్రి అంగన్వాడీల విషయంలో ఇలా చేయడం చాలా దారుణం అని అన్నారు. జగన్ రెడ్డి గారు ప్రతిసారి నా చెల్లెమ్మలు, నా అక్కమ్మలు అని చెప్పి, ఈరోజు అదే అక్క చెల్లెమ్మలను రోడ్డుమీద పడేసాడు.. అంగన్వాడీలు కోరుకుంటున్న కనీస వేతనం కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తుందని, వారు చేస్తుంది సేవ అని, ఆ సేవని వెట్టి చాకిరీలాగా మార్చి ఈ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని, అలాగే ఇటీవల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని, వైసిపి వారికి ఆడవాళ్ళ పట్ల ఉన్న విజ్ఞత ఏ పాటిదో తెలియజేస్తుంది అని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులకు సమాధానం చెబుతామని, అలాగే ఈ ప్రభుత్వం అంగన్వాడి యొక్క డిమాండ్లను రెండు, మూడు రోజుల్లో తీర్చకపోతే జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి తెలియజేశారు. అప్పటికి కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చకపోతే, రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆ హయాంలో ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాధ్, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు, కాకుమాను జనసేన పార్టీ మండల అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు, కాకుమాను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సునీల్, జనసేన నాయకులు కాటూరి శ్రీనివాసరావు, పతెళ్ల. మల్లికార్జున, ఎస్ కె. హుస్సేన్, యడ్ల.వెంకటేశ్వరరావు, కాకుమాను మరియు పెనందిపాడు మండల జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు.