ఐకేపీ విఓఏల సమ్మెకు జనసేన మద్దతు

భైంసా లో ఐకెపి వీఓఏలు గత 26 రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం ఇవ్వాలని, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, కోరుతూ భైంసా లో ఎంపిడిఓ కార్యాలయం ముందర సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ఆ సంఘం నాయకులతో కాని, సభ్యులతో కాని చర్చలకు పిలిపించక పోవడం చాలా దుర్మార్గం. మహిళా సంఘాలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక రూపాల్లో ప్రభుత్వ ఖజానాకు లాభాలు తెస్తు సహకరిస్తున్న ఈ ఉద్యోగులను పట్టించుకోక పోవడాన్ని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విరి సమస్యలను వెంటనే పరిష్కరించి చర్చలకు పిలవాలని డిమాండ్ చేసారు. లేని యెడల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి పోరాటానికి నాయకత్వం వహించి భవిష్యత్ కార్యాచరణలో ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం అని సుంకేట మహేష్ బాబు తెల్పారు.