నర్సంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ, నర్సంపేట, భారత జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలను నర్సంపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జీ మేరుగు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో జనసేన కార్యవర్గ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శివకోటి యాదవ్ మాట్లాడుతూ కోట్లాదిమంది ప్రజలు కుల, మతాలకు అతీతంగా పూజించే వ్యక్తి గాంధీ అని అన్నారు. అహింసా మార్గంలో స్వతంత్ర సంగ్రామాన్ని నడిపించిన యోధుడు మహాత్మా గాంధీ అనుసరించిన మార్గం అన్ని తరాలకు ఆదర్శప్రాయం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు వంగ మధు, షేక్ హుస్సేన్, ఉడుగుల క్రాంతి, గంగుల రంజిత్, ప్రధాన కార్యదర్శులు ఓర్సు రాజేందర్, గాండ్ల అరుణ్, కార్యవర్గ సభ్యులు బొబ్బ పృథ్వీరాజ్, రొడ్డ శ్రీకాంత్, కొమ్ము రంజిత్, రాపోలు సురేష్, గద్దల కిరణ్, మిలాన్, లహరి, రణదీప్, సూర్య, రవి, భార్గవ్, నితిన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.